Brahmanandam: గన్నవరం విమానాశ్రయంలో జగన్ తో సినీ నటుడు బ్రహ్మానందం

Brahmanandam YS Jagan meet at airport
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కలిశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఈ అరుదైన కలయిక చోటు చేసుకుంది. బెంగళూరుకు వెళ్లేందుకు జగన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఒక పని మీద గన్నవరం చేరుకున్న బ్రహ్మానందం ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బ్రహ్మానందం యోగక్షేమాలు, ఆరోగ్యం గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Go Back to Shorts
Brahmanandam
YS Jagan
Jagan Mohan Reddy
Telugu actor
Gannavaram Airport
Vijayawada
YSRCP
Andhra Pradesh politics
Telugu cinema

More Telugu News