Ambati Rambabu: పెమ్మసాని 18 రోజులు సినిమా చూపించాడు.. పారిపొమ్మని సీఐ చెప్పాడు: అంబటి రాంబాబు

Ambati Rambabu Pemmasani Showed Me Movie for 18 Days
  • చంద్రబాబును ఉద్దేశించి తాను ఏమీ అనలేదన్న అంబటి
  • రాత్రి 2 గంటల సమయంలో పోలీసులు తనను కొట్టేందుకు యత్నించారని వెల్లడి
  • తన ఇంటిపై దాడి చేసిన వారంతా కమ్మవారేనన్న అంబటి
  • పెమ్మసాని మూల్యం చెల్లించాల్సిందేనని వ్యాఖ్య
  • ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్న మాజీ మంత్రి

మూడు కేసులకు సంబంధించి 18 రోజుల పాటు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై మండిపడ్డారు. “24 గంటల్లో సినిమా చూపిస్తానన్నావ్... 18 రోజులు సినిమా చూపించావు. ఇందులో ఎవరు హీరో? నేనే హీరో. మీరు విలన్లు అయ్యారు” అని అన్నారు.


మీడియాతో మాట్లాడుతూ అంబటి చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే:

  • ఇరవై రోజులుగా ఎన్నో జరిగాయి. ఏం జరిగిందో ప్రజలు అర్థం చేసుకున్నారు.
  • జనవరి 31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో మొన్న విడుదల అయ్యాను.
  • ఈ 18 రోజులు మాట్లాడే అవకాశమే రాలేదు. నా కూతురు అందరికీ అర్థమయ్యేలా అన్ని విషయాలు చెప్పింది.
  • టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లి మంచి పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం చేశాను. ఫ్లెక్సీని నేను చించివేయలేదు.
  • మరుసటి రోజు గుళ్లలో పూజలు చెయ్యమని పార్టీ నుంచి సమాచారం వచ్చింది. పర్మిషన్ తీసుకుని అక్కడకు వెళ్లాను. 
  • తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ బూతులు తిట్టారు. ఆ తర్వాతే నేను కూడా తిట్టాను.
  • తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు. నేను అన్న మాటలు చంద్రబాబును ఉద్దేశించి కాదు. ఇంటికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపానికి గురయ్యాను.
  • ఐదు గంటలకు ఇంటివద్దకు పలు నియోజకవర్గాల నుంచి భారీగా జనం వచ్చారు. నా కుటుంబ సభ్యులు, మనవళ్లు ఇంట్లో ఉన్నారు. ఏడు గంటలపాటు టీడీపీ గూండాలు రచ్చ చేశారు. ఇంటిపై దాడి చేసిన వారంతా కమ్మవారే. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా?
  • వైసీపీ వారిని మా ఇంటి వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. పారిపోవాలని సీఐ గంగా వెంకటేశ్వర్లు నాతో చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని నేను చెప్పాను.
  • పోలీసులు నన్ను తీసుకెళ్లి లాకప్ లో పెట్టారు. రాత్రి 2 గంటలకు స్టేషన్ పైకి తీసుకెళ్లి నన్ను కొట్టడానికి ప్రయత్నించారు. కానీ కొట్టలేదు. నన్ను కొట్టడానికి ప్రయత్నించడంపై న్యాయపోరాటం చేస్తా.
  • నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్ లో... "కమ్మ నా కొడకల్లారా" అని తిట్టానని రాశాడు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతున్నది మీరే.
  • పెమ్మసాని చంద్రశేఖర్ మూల్యం చెల్లించే రోజు వస్తుంది. తప్పక మూల్యం చెల్లించాల్సిందే.
  • పోలీసులతో హత్యలు చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఆ అలవాటు నారా లోకేశ్ కి వచ్చింది.
  • నేను కమ్మ వ్యతిరేకిని కాదు. నన్ను నిర్మూలించాలని రెడ్ బుక్ లో రాసుకున్నారట.
  • చంద్రబాబు కమ్మని ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కాపుకాస్తున్నాడు. వంగవీటి రంగాను కోల్పోయాం. ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేము.
Ambati Rambabu
Pemmasani Chandrasekhar
Andhra Pradesh Politics
YSRCP
TDP
Nara Chandrababu Naidu
Guntur
Police
Criminal Cases
Central Jail

More Telugu News