Ranveer Singh: రూ.10 కోట్లు ఇవ్వండి: నటుడు రణ్‌వీర్ సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

Ranveer Singh Receives Threats from Lawrence Bishnoi Gang Demanding 10 Crores
  • అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపు
  • నటుడి మేనేజర్ వాట్సాప్ ఖాతాకు బెదిరింపు వాయిస్ నోట్
  • అమెరికా అధికారులను సంప్రదించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి రణ్‌వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ ఖాతాకు బెదిరింపు వాయిస్ నోట్ వచ్చింది. దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అమెరికా అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ ప్రముఖులకు ఇటీవల వరుస బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. తనను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి బాలీవుడ్ ప్రముఖులకు ఈ బెదిరింపు సందేశం పంపించాడు. తాను కోరినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే సిబ్బందిని హత్య చేస్తానని బెదిరించాడు. మీ మేనేజర్ నుంచి మీ వద్ద పని చేసే ప్రతి ఒక్కరి వివరాలు మాకు తెలుసని, వారు తమ కుటుంబాలతో ఎక్కడ నివసిస్తున్నారో కూడా తెలుసని, వాళ్లకు ఏమీ కాకముందే మీరు డిమాండ్లకు అంగీకరించాలని ఆ వాయిస్ నోట్‌లో పేర్కొన్నాడు.

ఇంతకుముందు నటుడు రోహిత్ శెట్టి ఇంటి వెలుపుల ముగ్గురు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభమ్ లోంకర్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదివరకు నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులకు పాల్పడిన ఘటనలోనూ లోంకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Ranveer Singh
Lawrence Bishnoi
Bollywood
Extortion
Mumbai Crime Branch
Threats
Rohit Shetty

More Telugu News