AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్

AP Government Good News for Sarpanches Funds Release Approved
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది.

జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను మెజర్‌మెంట్ పుస్తకాలలో నమోదు చేసి ఉంటే, ఆ బిల్లులను చెల్లించవచ్చని తెలిపింది.

గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో సర్పంచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వారికి ఊరట కలిగించే అంశం. ఈ నిర్ణయంతో పంచాయతీల్లో నిలిచిపోయిన చెల్లింపులకు మార్గం సుగమం అయినట్లయింది.
Go Back to Shorts
AP Government
Andhra Pradesh
Gram Panchayats
15th Finance Commission
Funds utilization
Village development works
Sarpanch
Panchayat Raj
Rural development

More Telugu News