Priyamani: గ్లోబల్ స్టార్ కాబోతున్న ప్రియమణి!

Priyamani stars in Indo American film with Mohit Raina
షార్ట్స్‌లో చూడండి

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ప్రియమణి... పలు వెబ్ సిరీస్‌ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇండో-అమెరికన్ చిత్రంలో ప్రియమణి ప్రధాన పాత్రకు ఎంపికయింది. బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి ఆమె ఈ అంతర్జాతీయ చిత్రంలో నటించబోతోంది.


హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్, ముంబైలోని అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.


భారతీయ, అమెరికా సంస్కృతుల కలయికతో, ఒక వలస కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగపూరిత ప్రయాణమే ఈ సినిమా కథాంశం. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తుండటం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది.

Go Back to Shorts
Priyamani
Priyamani Hollywood movie
Mohit Raina
Indo-American movie
Red Bison Productions
Azure Entertainment
Harsh Mahadeshwar
Tollywood
Bollywood
Indian American culture

More Telugu News