Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ప్రపంచంలో మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు తాతయ్యా: కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన హిమాన్షు

KCR Birthday Wishes From Grandson Himanshu Rao
Advertisement
  • తాత కేసీఆర్‌కు మనవడు హిమాన్షు రావు భావోద్వేగభరిత శుభాకాంక్షలు
  • తాను బాగుండటం కోసం తాత ఎంతో తపించారని పోస్ట్
  • ఇకపై తాతను తాను బాగా చూసుకుంటానని హిమాన్షు వాగ్దానం
  • కేసీఆర్ లాగే నిజాయతీగా, ధర్మంగా ఉండేందుకు ప్రయత్నిస్తానన్న హిమాన్షు
Advertisement

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన తాత గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ భావోద్వేగభరిత పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాతామనవడి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ అద్భుతంగా ఆవిష్కరించింది.

"పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్యా...

మీరు ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. అయినా, నాపై మాత్రం ఎనలేని ప్రేమను, ఆనందాన్ని కురిపించారు. నేను బాగుండాలనే మీ జీవితాన్ని గడిపారు. మీరు బాగుండేలా చూసుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని మాటిస్తున్నాను.

ఇది చాలా కష్టమైన లక్ష్యమని నాకు తెలుసు. కానీ, మీలాగే నిజాయతీగా, దయతో, ధర్మంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను..." అంటూ హిమాన్షు ట్వీట్ చేశాడు.
Advertisement
Advertisement
KCR
Kalvakuntla Chandrashekar Rao
Himanshu Rao
BRS
Telangana
Birthday Wishes
Grandfather
Politics

More Telugu News