Suryakumar Yadav: వాళ్లతో బౌలింగ్ చేయించి పాకిస్థాన్ జట్టు పరిస్థితిని సూర్యకుమార్ చెప్పకనే చెప్పాడు: మాజీ క్రికెటర్

Suryakumar Yadavs tactics expose Pakistans batting says Atul Wassan
  • పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించిన కెప్టెన్ సూర్యకుమార్
  • తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో బౌలింగ్ చేయించడంపై స్పందించిన అతుల్ వాసన్
  • పాకిస్థాన్ బ్యాటింగ్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పాడని వ్యాఖ్య  
  • ఏ విషయంలోనూ భారత్‌తో పాకిస్థాన్‌కు పోలిక లేదన్న అతుల్ 
పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించాడని టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్‌తో కెప్టెన్ బౌలింగ్ చేయించాడని గుర్తు చేశాడు. తద్వారా సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌ను కొంచెం పొడిగించాడని అభిప్రాయపడ్డాడు.

అయితే ఈ పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించడం ద్వారా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పాడని అన్నాడు. ఏ విషయంలో కూడా భారత్‌తో పాకిస్థాన్‌కు పోలిక లేదని అన్నాడు.

కాగా, కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. పార్ట్ టైమ్ బౌలర్లలో తిలక్ వర్మ రెండు ఓవర్లు వేసి 11 పరుగులు, రింకూ సింగ్ ఒక ఓవర్ వేసి 9 పరుగులు ఇచ్చారు. తిలక్ వర్మ తొలి బంతికే వికెట్ తీయడం గమనార్హం.
Suryakumar Yadav
India vs Pakistan
Tilak Varma
Rinku Singh
Asia Cup 2023
Cricket
Part-time Bowlers

More Telugu News