Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రహాంతర జీవులు ఉన్నాయా? అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఏమన్నారంటే?

Barack Obama on the existence of aliens
Advertisement
  • ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉన్నారనే విషయాన్ని విశ్వసిస్తున్నానని వెల్లడి
  • ఏలియన్స్‌ను ఏరియా 51లో నిర్బంధించారనే వార్తలను ఖండించిన ఒబామా
  • ఆ ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేదన్న బరాక్ ఒబామా
Advertisement
ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉన్నారనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ, ఏలియన్స్‌ను ఏరియా 51లో అమెరికా నిర్బంధించిందనే విమర్శలను ఆయన ఖండించారు. ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

దశాబ్దం క్రితం యూఎస్ ఎయిర్ ఫోర్స్ రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్‌లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ జీవుల ఉనికి కనిపించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై కూడా ఒబామా స్పందించారు. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సమాచారం లేదని అన్నారు.

అమెరికాలోని నెవాడలో ఉన్న 'ఏరియా 51' అత్యంత రహస్య ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు, ఆయుధాలు సహా పలు రకాల సాంకేతికతలను పరీక్షిస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లలో ఏర్పాటు చేశారు. నెవాడ ప్రాంతంలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో 'ఏరియా 51' ఉంది.
Advertisement
Advertisement
Barack Obama
Aliens
Extraterrestrial life
Area 51
US Air Force
Reaper drones
Nevada

More Telugu News