Jacqueline Fernandez: వాలెంటైన్స్ డే సందర్భంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేశ్ లవ్ లెటర్!

ఢిల్లీలోని మండోలి జైలు గోడల మధ్య నుంచి బయటికి వచ్చిన ఓ ‘ప్రేమలేఖ’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ వాలెంటైన్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్‌కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

లేఖలో ఏముందంటే..

జైలులో నుంచే సుకేశ్ తన ‘ఖరీదైన ప్రేమ’ను మరోసారి వ్యక్తం చేశాడు. జాక్వెలిన్‌ను బొమ్మా, ఏంజెల్, జాకీ అంటూ సంబోధిస్తూ, ఆమెకు ఎయిర్‌బస్ H - సిరీస్ హెలికాప్టర్ బహుమతిగా ఇస్తానని పేర్కొన్నాడు. ఆ హెలికాప్టర్‌పై ‘JF’ అక్షరాలు ముద్రించి, ఆమె ప్రైవేట్ జెట్, యాచ్ రంగులోనే పెయింట్ చేయిస్తానని చెప్పుకొచ్చాడు. ఇది అక్రమ సొమ్ముతో కాదని, తన కష్టార్జిత డబ్బుతోనే కొంటున్నానని లేఖలో పేర్కొన్నాడు. తమ ప్రేమకథను రోమియో - జూలియట్, హీర్ - రంజా, లైలా -మజ్ను వంటి జంటలతో పోల్చుతూ భావోద్వేగాలు వ్యక్తం చేశాడు. జైలు గోడలు మమ్మల్ని వేరు చేసినా, నా హృదయంలో నీ పేరే వినిపిస్తుంది అంటూ రాశాడు. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుమణిగి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నిన్ను వదలను అంటూ తన ప్రేమను ప్రకటించాడు. 

ఇలాంటి లేఖలు రాయడం సుకేశ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా వాలెంటైన్స్ డే, క్రిస్మస్, నవరాత్రి, జాక్వెలిన్ పుట్టినరోజు సందర్భాల్లో విలాసవంతమైన బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. గత ఏడాది గల్ఫ్‌స్ట్రీమ్ ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు, పెంట్ హౌస్‌లు, ద్రాక్ష తోటలు గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. 

అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. సుకేశ్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, అతను చెప్పే ఖరీదైన బహుమతుల గురించి తనకు సమాచారం లేదని ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్, మోసం కేసులో సుకేశ్ ప్రధాన నిందితుడిగా జైలులో ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 
Jacqueline Fernandez
Sukesh Chandrasekhar
Valentine's Day
love letter
money laundering case
Bollywood actress
Mandoli Jail
airbus helicopter
private jet
gifts

More Telugu News