మాకు భారత్‌పై మంచి రికార్డేమీ లేదు: పాకిస్థాన్ కెప్టెన్

  • గత చరిత్రను మార్చలేమన్న కెప్టెన్ సల్మాన్ అలీ అఘా
  • కొలంబోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి
  • రేపు కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్
భారత క్రికెట్ జట్టుపై తమకు మంచి రికార్డు ఏమీ లేదని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అన్నాడు. గత చరిత్రను తాము మార్చలేమని, కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా కొలంబో వేదికగా రేపు (ఫిబ్రవరి 15) భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సల్మాన్ అలీ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి కూడా సల్మాన్ అలీ స్పందించాడు. అభిషేక్ మంచి ఆటగాడని కితాబిచ్చాడు. అత్యుత్తమ జట్టుతో ఆడాలని తాము కోరుకుంటున్నామని అన్నాడు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని అన్నాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో భారత్, పాకిస్థాన్ ఎనిమిదిసార్లు తలపడగా, ఏడుసార్లు టీమిండియా, ఒకసారి దాయాది దేశం గెలిచింది.


More Telugu News