మనవళ్ల పేర్లపై చిరంజీవి స్పందన.. చరణ్, ఉపాసనను అభినందించిన మెగాస్టార్
- చరణ్, ఉపాసన దంపతులను అభినందించిన చిరంజీవి
- మనవళ్ల పేర్లు ఎంతో అర్థవంతంగా ఉన్నాయని ప్రశంస
- మన సంస్కృతి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పేర్లు ఎంచుకున్నారని వెల్లడి
- నాయనమ్మ పేరు వచ్చేలా మనవరాలికి పేరు పెట్టడంపై హర్షం
మెగాస్టార్ చిరంజీవి తన మనవళ్లు, మనవరాళ్ల పేర్ల విషయంలో తన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కొణిదెల తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. మన సనాతన సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా ఎంతో అర్థవంతమైన పేర్లను ఎంచుకున్నారని ఆయన అభినందించారు.
"మా రెండు చిన్ని సంతోషాలకు పెట్టిన అందమైన పేర్లను ప్రశంసిస్తూ బంధువులు, స్నేహితులు, అభిమానుల నుంచి ఫోన్లు, సందేశాలు వస్తున్నాయి. మన సంస్కృతి, ఆలయాల ఆశీస్సులతో కూడిన పేర్లను ఎంపిక చేసుకున్నందుకు గర్వంగా వుంది, ప్రియమైన ఉపాసన, చరణ్‌లకు నా హృదయపూర్వక ప్రేమ, అభినందనలు" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.
"ఈ పేర్లలో భక్తి, సాంస్కృతిక స్మృతి, తరతరాలుగా మనల్ని నడిపిస్తున్న దైవిక కరుణ ఉన్నాయి. అలాగే, మనవరాలు అన్వీరకు తన నాయనమ్మ అంజనా దేవి పేరులోని 'దేవి'ని చేర్చడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇది చరణ్ ఆలోచనా విధానానికి నిదర్శనం" అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ చిన్నారులపై దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
కాగా, రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించిన విషయం తెలిసిందే. వీరికి శివరామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను కూడా చరణ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వివరించారు. జనవరి 31న జన్మించిన ఈ కవలలతో చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు.