Santosh Sobhan: రేపు 'కపుల్ ఫ్రెండ్లీ' ప్రీమియర్స్... ఎక్కడ చూడొచ్చంటే...!

యంగ్ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, విడుదలకు ఒక రోజు ముందే, అంటే ఫిబ్రవరి 13న, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారు.

రేపు హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏఏఏ సినిమాస్‌లో, విశాఖలోని మెలోడీ, విజయవాడలోని శైలజ థియేటర్లలో, గుంటూరులోని భాస్కర్ థియేటర్‌లో రాత్రి 7 గంటలకు ప్రీమియర్లు ప్రారంభమవుతాయి. 

అలాగే, నెల్లూరు ఎం1 సినిమాస్‌లో రాత్రి 9 గంటలకు, తిరుపతి పీజీఆర్ థియేటర్‌లో సాయంత్రం 6:45 గంటలకు ఈ స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు.

యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అజయ్ కుమార్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. చెన్నై నేపథ్యంలో సాగే ఈ కథలో ఇంటీరియర్ డిజైనర్‌గా సంతోష్ శోభన్, ఐటీ ప్రొఫెషనల్‌గా మానస వారణాసి నటిస్తున్నారు. బైక్ పూలింగ్ ద్వారా పరిచయమైన వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథే ఈ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ చిత్రానికి అదిత్య రవీంద్రన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
Santosh Sobhan
Couple Friendly
Manasa Varanasi
Ashwin Chandrasekhar
romantic comedy
Telugu movie
previews
February 14
UV Concepts
Telugu cinema

More Telugu News