Akira Nandan: అడివి శేష్ దర్శకత్వంలో అకీరా నందన్ గ్రాండ్ ఎంట్రీ?

Adivi Sesh to Direct Akira Nandans Debut Movie
  • అకీరా నందన్ ఆరంగేట్రంపై జోరందుకున్న చర్చ
  • అడివి శేష్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ వార్తలు
  • అకీరా కోసం అడివి శేష్ వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారని టాక్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అనే ప్రశ్నలు గత కొంత కాలంగా ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు ఈ చర్చలో టాలెంటెడ్ హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా డెబ్యూ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది.

అకీరాతో శేష్‌కు ఉన్న సాన్నిహిత్యం ఈ వార్తలకు బలం ఇస్తోంది. ముఖ్యంగా ‘రైటర్స్ బ్లాక్’ షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతం అందించినప్పుడు శేష్ మద్దతుగా నిలిచారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అడివి శేష్... అకీరా కోసం ప్రత్యేకమైన, వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వారసుడి డెబ్యూ కాబట్టి సాధారణ కమర్షియల్ ఎంట్రీ కాకుండా, కంటెంట్ బేస్డ్ మూవీతో లాంచ్ చేయాలని పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్‌లో శేష్ దర్శకత్వం వహిస్తారా? లేక కేవలం కథ అందిస్తారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Akira Nandan
Adivi Sesh
Pawan Kalyan
Tollywood debut
Telugu cinema
Writers Block
Shekhar Kammula
Content based movie
Akira Nandan debut
Telugu film industry

More Telugu News