జేఈఈ మెయిన్ ఫలితాలపై ఎన్టీయే తాజా కబురు
- జేఈఈ మెయిన్ 2026 (సెషన్–1) ఫలితాలు ఫిబ్రవరి 16కి వాయిదా
- 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు జేఈఈ మెయిన్ సెషన్-2కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం
- అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్‌టీఏ
జేఈఈ మెయిన్ 2026 (సెషన్–1) ఫలితాల విడుదలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన చేసింది. ఫలితాలను ఫిబ్రవరి 16నాటికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక నోటీసును జారీ చేసింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ తుది సమాధాన కీ, ఫలితాలను ఫిబ్రవరి 12నాటికి ప్రకటించాల్సి ఉంది. దీంతో బుధవారం రాత్రి లేదా గురువారం ఫలితాలు వెలువడతాయని దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే తాజా అప్డేట్‌తో ఫలితాల విడుదల తేదీని ఫిబ్రవరి 16కు వాయిదా వేసినట్లు స్పష్టం అయింది.
ఇక జేఈఈ మెయిన్ సెషన్-2కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సెషన్ - 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.