'దృశ్యం 3'లో కీలక పాత్రలో ప్రకాశ్ రాజ్
- అజయ్ దేవగణ్ హీరోగా 'దృశ్యం 3'
- ఈ చిత్రం నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా
- గాంధీ జయంతి సందర్భంగా విడుదలవనున్న చిత్రం
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో 'దృశ్యం 3' సినిమా చిత్రీకరణ ప్రారంభమయింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ... ఇంత అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో తనది ఒక ప్రత్యేకమైన పాత్ర అని తెలిపారు.
మరోవైపు ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నారు. ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే, ప్రకాశ్ రాజ్ తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో తాను ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ చిత్ర నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ స్పందిస్తూ... అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్ నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. అక్షయ్ ఖన్నా పోషించిన తరహా పాత్రనే జైదీప్ చేస్తారని తెలిపారు. ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరోవైపు, ఈ సినిమా కోసం అక్షయ్ ఖన్నాకు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అగ్రిమెంట్ చేసుకుని, డేట్స్ కూడా ఇచ్చి అక్షయ్ కుమార్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. నిర్మాతలు ఫోన్ చేసినా అక్షయ్ స్పందించలేదు. ఈ క్రమంలో అక్షయ్ కు నిర్మాతలు కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపారు.