Sravanthi: ఎన్నో కష్టాలు పడ్డాను .. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ స్రవంతి

Anchor Sravanthi Interview
షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరపై .. ఈవెంట్స్ లోను సందడి చేసే కొంతమంది యాంకర్స్ కి హీరోయిన్స్ తో సమానమైన క్రేజ్ ఉందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అతికొద్ది మంది యాంకర్స్ లో స్రవంతి ఒకరు. స్రవంతి గ్లామర్ కీ .. ఆమె మాట తీరుకీ .. నవ్వుకి యూత్ వైపు నుంచి చాలామంది అభిమానులు ఉన్నారు. ఒక రకంగా హీరోయిన్స్ కి ఉండవలసిన లక్షణాలు ఆమెలో ఉన్నాయని భావిస్తుంటారు. అయితే ఆమె మాత్రం యాంకర్ గానే కొనసాగుతూ వెళుతున్నారు. 

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్రవంతి మాట్లాడుతూ .. "నేను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో ఒక వైపున చదువుకుంటూనే మరో వైపున డాన్స్ నేర్చుకునేదానిని. ఒకసారి నేను మా ఫ్రెండ్ తో కలిసి 'మహంకాళి' సినిమా షూటింగుకి వెళ్లాను. అక్కడ జర్నలిస్ట్ గా చేయవలసిన ఆర్టిస్ట్ రాకపోవడంతో నాతో చేయించారు. రోజుకి 3 వేల రూపాయలు ఇచ్చారు. ఇదేదో బాగుందే అనిపించింది. ఆ సమయంలోనే నేను ప్రేమలో పడ్డాను. వాళ్ల ఫ్యామిలీకి ఇష్టం లేదని తెలిసి సినిమాలు మానేశాను" అని అన్నారు. 

"పెళ్లి తరువాత ఆయన బిజినెస్ దెబ్బతింది. దాంతో నేను జాబ్ చేయవలసి వచ్చింది. ఒక జ్యుయలరీ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేశాను. ఉదయం నుంచి రాత్రి వరకూ కూర్చోకూడదు. అలా ఏడాదిన్నర పాటు పనిచేశాను. ఇక నా వల్ల కాదనిపించి మానేశాను. ఆ తరువాత నుంచి యాంకరింగ్ వైపు వచ్చాను. బన్నీతో చేసిన ఒక ఇంటర్వ్యూ నన్ను 'బిగ్ బాస్'కి తీసుకుని వెళ్లింది. ఆ డబ్బు నాకు చాలా హెల్ప్ అయింది"అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Go Back to Shorts
Sravanthi
Anchor Sravanthi
Telugu Anchor
TV Anchor
Big Boss Telugu
Anchor Sravanthi Interview
Telugu News
Entertainment News
Hyderabad
Jewellery Sales Girl

More Telugu News