విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు ప్రాజెక్టుకు పచ్చజెండా
- విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- సీఎం చంద్రబాబుతో భేటీలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
- పెరుగుతున్న ట్రాఫిక్, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఈ సానుకూల స్పందన లభించడం గమనార్హం.
సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు, ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతి ఇస్తున్నట్లు ఖట్టర్ స్వయంగా చంద్రబాబుకు తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో విశాఖ మెట్రో ఏర్పాటులో కీలక ముందడుగు పడినట్లయింది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంతో త్వరలోనే పనులు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ మెట్రో ప్రతిపాదనపై కూడా త్వరలో స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.