Lahore 1947: 'లాహోర్ 1947' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ లో 'లాహోర్ 1947' చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. షబానా అజ్మీ, ప్రీతి జింటా, కరణ్ డియోల్, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జావెద్ అఖ్తర్ సాహిత్యాన్ని సమకూర్చారు. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 13న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 'గదర్ 2' వంటి భారీ హిట్ తర్వాత సన్నీ డియోల్ నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ ఫుల్ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది.
Lahore 1947
Aamir Khan
Sunny Deol
AR Rahman
Shabana Azmi
Preity Zinta
Karan Deol
Ali Fazal
Bollywood
Independence Day 2026

More Telugu News