Mohsin Naqvi: పాక్ క్రికెట్ వివాదంలోకి ఆర్మీ చీఫ్ పేరు.. బెదిరింపులకు లొంగబోమంటూనే.. భారత్‌తో మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్

Mohsin Naqvi Pakistan Cricket Controversy Army Chief Name
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్థాన్, చివరికి తన నిర్ణయాన్ని మార్చుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు, మిత్రదేశాల జోక్యంతో వెనక్కి తగ్గి, భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 15న జరగనున్న మ్యాచ్‌లో పాల్గొనాలని తమ జట్టుకు ఆదేశాలు జారీ చేసినట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ వివాదానికి అసలు కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలే. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, ఐసీసీ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం భయపడదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన కూడా ఎలాంటి ఒత్తిడికి లొంగరని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. క్రికెట్‌లోకి సైన్యాన్ని లాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాకిస్థాన్ క్రికెట్‌లో రాజకీయ, సైనిక జోక్యం కొత్తేమీ కానప్పటికీ, కీలకమైన వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత జఠిలం చేసింది.

అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే పాకిస్థాన్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జరిపిన చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. మిత్రదేశాల అభ్యర్థన మేరకు 'క్రికెట్ స్ఫూర్తిని' కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ నెల‌ 15న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కేవలం ఐదు రోజులే సమయం ఉందనగా ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఆసియా కప్‌లో పాక్ క్రీడాకారులు మైదానంలో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఈసారి వరల్డ్‌కప్ పోరు ఏ స్థాయిలో ఉంటుందోనని క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Mohsin Naqvi
Pakistan cricket
India Pakistan match
T20 World Cup
PCB chairman
Asim Munir
Pakistan Army
Cricket controversy
Shahbaz Sharif
Anura Kumara Dissanayake

More Telugu News