Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదు చేరుకున్న సీబీఐ కొత్త జేడీ అరుణాచలం

సీబీఐ కొత్త జేడీగా నియమితుడైన అరుణాచలం ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంతకు క్రితమే ఆయన చెన్నయ్ నుంచి హైదరాబాదు చేరుకున్నారు. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిన్నటి వరకు జేడీ గా పనిచేసిన లక్ష్మీనారాయణను ఇటీవలే ఆయన సొంత కేడర్ మహారాష్ట్రకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అరుణాచలం సీబీఐ కేసుల విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న విషయంపై అందరిలోనూ కుతూహలం చోటు చేసుకుంది. అయితే ఒకటి ... అక్రమార్కుల విషయంలో లక్ష్మీనారాయణ కన్నా ఈయన రెండాకులు ఎక్కువే చదివారని అంటారు. ముక్కుసూటి మనస్తత్వం, విధి నిర్వహణలో ఎవరినీ ఖాతరు చేయకపోవడం, నిజాయతీ అరుణాచలంకు ఆభరణాలని పేరుంది!

More Telugu News