YS Jagan: జగన్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న సూర్య, కార్తీ... వీడియో వైరల్!
- చెన్నైలో తన బంధువు వివాహానికి హాజరైన జగన్
- అదే వేడుకకు విచ్చేసిన సూర్య, కార్తీ
- జగన్ ను మర్యాదపూర్వకంగా పలకరించిన కోలీవుడ్ బ్రదర్స్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ చెన్నైలో ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఓ ప్రైవేట్ వివాహ వేడుకకు జగన్ విచ్చేయగా... ఆయన వద్దకు వచ్చిన సూర్య, కార్తీ సోదరులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జగన్ ను మర్యాదపూర్వకంగా పలకరించారు. ముఖ్యంగా, జగన్, సూర్య ఎంతో ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. జగన్ కూడా వారితో నవ్వుతూ మాట్లాడటం వీడియోలలో కనిపించింది.
ఈ కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ దృశ్యాలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తన పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడైన వైఎస్ సునీల్ రెడ్డి తనయుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు జగన్ తన అర్ధాంగి వైఎస్ భారతితో కలిసి చెన్నై వెళ్లారు. స్థానిక లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన వధూవరులు సాహిల్, వేదికలను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.