వంద కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. ఎక్కడంటే!

  • అమీన్ పూర్ లోని చక్రపురి లేఔట్ లో అక్రమాలు
  • రోడ్లు, పార్కు స్థలాల ఆక్రమణ.. బుల్డోజర్లతో హైడ్రా తొలగింపు
  • స్థానికుల ఫిర్యాదుతో చర్యలు
హైదరాబాద్ లోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు తాజాగా వంద కోట్ల విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని కాపాడారు. ఆక్రమణలు కూల్చివేసి కబ్జాదారుల చెర నుంచి విలువైన భూమిని విడిపించారు. అమీన్ పూర్ లోని చక్రపురి లేఔట్ లో రోడ్లు, పార్కు స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం బుల్డోజర్లతో అమీన్ పూర్ చేరుకున్న అధికారులు.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేశారు.

పోలీస్ సిబ్బంది బందోబస్తుతో రెవెన్యూ అధికారుల సమక్షంలో హైడ్రా అధికారులు మొత్తం 15 జేసీబీలతో ఆక్రమణలు తొలగించారు. దీంతో పాటు మేడ్చల్- మ‌ల్కాజిగిరి జిల్లా దూల‌ప‌ల్లి విలేజ్‌లోని సుమారుకుంట‌లో, నాగారం రామకృష్ణ నగర్ కాలనీలోని శివాల‌యానికి చెందిన 1,365 గజాల స్థలాన్ని, యూసుఫ్గూడలో మూడున్నర ఎక‌రాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది.


More Telugu News