Shashank Bhupathi: వరంగల్ చరిత్రలో తొలిసారి.. నింగిలోకి 'రుద్రమ' రాకెట్!

Warangal to Witness First Rudrama Rocket Launch on Science Day
  • వరంగల్ చరిత్రలో తొలిసారిగా మోడల్ రాకెట్ ప్రయోగం
  • జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న కార్యక్రమం
  • 'రుద్రమ' పేరుతో రాకెట్‌ను ప్రయోగించనున్న నిర్వాహకులు
  • నిట్, కుడా సహకారంతో ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • విద్యార్థులు, ఆసక్తి ఉన్నవారికి ప్రవేశం ఉచితమని ప్రకటన
వరంగల్ చరిత్రలో తొలిసారిగా ఒక మోడల్ రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇస్రో స్పేస్ ట్యూటర్, ఏటీడీఆర్ఎల్ (అనిసియంట్ టెక్నాలజీస్ డిజైన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్) వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో ఈ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ నిట్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నాయి.

'రుద్రమ' అని నామకరణం చేసిన ఈ మోడల్ రాకెట్‌ను ప్రయోగించడానికి ముందు, హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో సైన్స్, అంతరిక్షంపై అవగాహన సదస్సు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. అనంతరం రాకెట్‌ను నింగిలోకి పంపిస్తారు.

దీంతో పాటు, అంతరిక్ష వీక్షణపై ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల 15 నుంచి 27 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భద్రకాళి ట్యాంక్‌బండ్‌పై టెలిస్కోపులతో నక్షత్ర వీక్షణ (స్టార్ గేజింగ్) కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్కూల్, కాలేజీ విద్యార్థులకు, ఆసక్తిగల వారికి ప్రవేశం ఉచితమని శశాంక్ తెలిపారు. 
Shashank Bhupathi
Warangal
Rudrama Rocket
Model Rocket
National Science Day
NIT Warangal
KUDA
Space Tutor
Star Gazing
Bhadrakali Tank Bund

More Telugu News