Sunil Thapa: మిరాయ్ నటుడు సునీల్ థాపా ఆకస్మిక మృతి

Mirai Actor Sunil Thapa Dies of Cardiac Arrest
  • నేపాల్ సీనియర్ నటుడు సునీల్ థాపా కన్నుమూత
  • ఖాట్మండులో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన నటుడు
  • 300 పైగా నేపాలీ, పలు బాలీవుడ్ చిత్రాల్లో నటన
  • ‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంక చోప్రా కోచ్‌గా గుర్తింపు
  • ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లోనూ కనిపించిన సునీల్
భారత, నేపాల్ చలనచిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. నేపాల్‌లోని ఖాట్మండులో శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

శుక్రవారం రాత్రి వరకు "రామ్ నామ్ సత్యో హో" అనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సునీల్, ఆ తర్వాత తన నివాసానికి వెళ్లి నిద్రపోయారు. శనివారం ఉదయం ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, నార్విక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈసీజీ నివేదిక ఆధారంగా గుండెపోటు కారణంగానే మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

1970వ దశకంలో ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ థాపా, అనంతరం నటన వైపు అడుగులు వేశారు. 300కు పైగా నేపాలీ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ సంపాదించారు. ముఖ్యంగా 'చినో' చిత్రంలో ఆయన పోషించిన 'రాతే కైలా' పాత్ర నేటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. బాలీవుడ్‌లో ‘ఏక్ దూజే కే లియే’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, ‘మేరీ కోమ్’ సినిమాలో ప్రియాంక చోప్రా కోచ్‌గా నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించారు.

సునీల్ థాపా అంత్యక్రియలు ముంబై నుంచి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఈరోజు ఖాట్మండులో నిర్వహించనున్నట్లు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Sunil Thapa
Sunil Thapa death
Nepali actor
Indian actor
Mirai actor
The Family Man
Priyanka Chopra Mary Kom
Chino movie
Ek Duuje Ke Liye
Cardiac arrest

More Telugu News