టీ20 వరల్డ్ కప్: రాణించిన హెట్మెయర్... విండీస్ 20 ఓవర్లలో 182-5

  • టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మెయర్ (64) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఫలితంగా స్కాట్లాండ్ ముందు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35), షాయ్ హోప్ (19) ఓ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, ఆ తర్వాత షిమ్రోన్ హెట్మెయర్ స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి రోవ్‌మన్ పావెల్ (24), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (26) కూడా వేగంగా ఆడి తమ వంతు సహకారం అందించారు.

స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ కర్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. సఫ్యాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్, డేవిడ్‌సన్ తలో వికెట్ తీశారు.

అనంతరం 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. తాజా సమాచారం అందేసరికి స్కాట్లాండ్ 2.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 19 పరుగులతో ఆడుతోంది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మైఖేల్ జోన్స్ (1) ఔటయ్యాడు.


More Telugu News