ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

  • ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని సీజ్డ్ ప్రాపర్టీస్ గదిలో అగ్ని ప్రమాదం
  • 1980ల నాటి భవనమని వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్
  • చివరి గదిలో స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్లు వెల్లడి
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని సీజ్డ్ ప్రాపర్టీస్ గదిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ గది పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫోరెన్సిక్ భవనం చాలా పాతదని, దీనిని 1980లలో నిర్మించారని తెలిపారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్లు తెలిపారు. అక్కడి నుంచి మంటలు వ్యాపించాయని, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయని అన్నారు.

హైదరాబాద్‌లోని అన్ని భవనాలను తనిఖీ చేస్తామని ఆయన తెలిపారు. రెసిడెన్షియల్, కమర్షియల్ కార్యాలయాలను తనిఖీ చేస్తామని అన్నారు. ఎండాకాలం సమీపించిన నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉందని తెలిపారు.


More Telugu News