Ravi Shastri: కుర్రాళ్లు అదుర్స్... ప్రొఫెషనల్స్‌లా ఆడారు: రవిశాస్త్రి

Ravi Shastri Praises India U19 Team Performance
  • అండర్-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత కుర్రాళ్లు
  • జట్టు ఆటతీరుపై భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి ప్రశంసలు
  • ఒత్తిడిని జయించి ప్రొఫెషనల్స్‌లా ఆడారంటూ కితాబు
  • ఈ పేర్లు భవిష్యత్తులోనూ వినిపిస్తాయని జోస్యం
అండర్-19 ప్రపంచకప్‌ను భారత యువ జట్టు కైవసం చేసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం గెలవడమే కాదు, వారు ఆడిన తీరు, కనబరిచిన పరిణితి అద్భుతమని కొనియాడాడు.

ఒత్తిడిని తట్టుకుని, ఎంతో నిలకడగా, బాధ్యతాయుతంగా ఆడారని తెలిపాడు. క్లిష్ట సమయాల్లో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌లా వ్యవహరించారని కితాబిచ్చాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఒకరి కోసం ఒకరు ఆడారని, ఇది వారి బలమైన వ్యక్తిత్వాన్ని, ఐకమత్యాన్ని తెలియజేస్తుందని వివరించాడు.

"ప్రతిభ మిమ్మల్ని గుర్తింపు పొందేలా చేస్తుంది, కానీ మిమ్మల్ని ముందుకు నడిపించేది మీ టెంపర్‌మెంట్ మాత్రమే" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ యువ జట్టులో ప్రతిభతో పాటు అద్భుతమైన టెంపర్‌మెంట్ కూడా పుష్కలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. ఇది వారి కెరీర్‌లో కేవలం మొదటి అధ్యాయం మాత్రమేనని, భారత క్రికెట్‌లో ఈ కుర్రాళ్ల పేర్లు చాలా కాలం పాటు వినిపిస్తూనే ఉంటాయని రవిశాస్త్రి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 
Ravi Shastri
India Under 19
U19 World Cup
Indian Cricket Team
Cricket
Under 19 World Cup 2024
Indian Cricket
Youth Cricket
Cricket News

More Telugu News