నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో మంటలు.. వీడియో ఇదిగో!

  • బిల్డింగ్ ను కమ్మేసిన పొగ
  • బయటకు పరుగులు పెట్టిన సిబ్బంది
  • మంటలు ఆర్పేసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ ను పొగ కమ్మేయడంతో లోపల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసి నార్త్‌జోన్‌ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


More Telugu News