ట్రంప్ కు ధన్యవాదాలు చెప్పిన మోదీ.. గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్
- ట్రేడ్ డీల్ పై ఇరు దేశాల సంయుక్త ప్రకటనను స్వాగతించిన ప్రధాని
- ఇరు దేశాలకూ ప్రయోజనమని వ్యాఖ్య
- మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి
ట్వీట్ ఇదే..
‘‘భారత్, అమెరికాల మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్ కు ఫ్రేమ్ వర్క్ ఖరారు చేశాం. ఇది అమెరికా, భారత్.. రెండు దేశాలకూ శుభవార్త. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పేందుకు నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్ కు కృతజ్ఞతలు. ఈ ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారత్ లోని రైతులు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.