ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతి

  • మహారాష్ట్రలోని గడ్చిరోలి భారీ ఎన్‌కౌంటర్ 
  • ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారన్న పోలీసు అధికారులు
  • ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడి
మహారాష్ట్రలోని గడ్చిరోలి (భమ్రాగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతం)లో గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, నిన్న మరో నలుగురు హతమయ్యారు. 

మృతుల్లో గడ్చిరోలి డివిజన్ కమిటీకి చెందిన కీలక నేత ప్రభాకర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి కాగా.. ప్రభాకర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో అధికారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


More Telugu News