A Chennakesavulu: సిగరెట్ సెగకు మాజీ సైనికుడు బలి.. మద్యం మత్తులో ప్రాణం తీసిన వ్యసనం
- సిగరెట్ రవ్వలు పడి పెంట్ హౌస్‌లో అగ్నిప్రమాదం
- నిద్రలో ఉండగా సోఫాకు అంటుకున్న మంటలు
- కాళ్ల నొప్పులతో కదలలేక సజీవ దహనం
హైదరాబాద్‌లోని హెచ్.ఎఫ్.నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వెలిగించిన సిగరెట్, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మాజీ సైనికోద్యోగి ఎ.చెన్నకేశవులు (68) తన ఇంట్లోని పెంట్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు.
1994లో సైన్యం నుంచి రిటైర్ అయిన చెన్నకేశవులు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. అయితే, ఆయనకు మద్యం, సిగరెట్లు తాగే అలవాటు ఉండటంతో.. ఇంటి రెండో అంతస్తులో ఉన్న పెంట్‌హౌస్‌ను తన వ్యక్తిగత గదిగా వాడుకునేవారు. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం మద్యం తాగిన ఆయన, సిగరెట్ వెలిగించి అలాగే మత్తులోకి జారుకున్నారు. ఆ సమయంలో సిగరెట్ రవ్వలు పడటంతో గదిలోని సోఫా, పరుపులకు మంటలు అంటుకున్నాయి. దురదృష్టవశాత్తూ చెన్నకేశవులు కాళ్ల నొప్పులతో బాధపడుతుండటంతో, మంటలు వ్యాపించిన సమయంలో ఆయన బయటకు పరిగెత్తలేకపోయారు.
పెంట్ హౌస్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానిక యువకులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఎన్.ఆర్.నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు కేసును పర్యవేక్షిస్తున్నారు.