Harshit Rana: టీమిండియాకు ఎదురుదెబ్బ: వరల్డ్ కప్ నుంచి హర్షిత్ రాణా అవుట్.. సిరాజ్‌కు పిలుపు
- మోకాలి గాయంతో ప్రపంచకప్‌కు హర్షిత్ రాణా దూరం
- అతడి స్థానంలో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్ ఎంపిక
- గతేడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్
ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. యువ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ గాయపడ్డాడు. దీంతో ఆయన స్థానంలో సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ వేసిన హర్షిత్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ కుడి మోకాలికి గాయమై మైదానాన్ని వీడాడు. లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించే సామర్థ్యం ఉన్న హర్షిత్ దూరం కావడం టీమిండియాకు ఒక రకంగా లోటే అని చెప్పాలి.
ఈ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరకు అనుభవానికే మేనేజ్‌మెంట్ ఓటు వేసింది. గతేడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ తనకున్న అపారమైన అంతర్జాతీయ అనుభవంతో బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నాడు. ఐపీఎల్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ రేసులో ఉన్నప్పటికీ, సిరాజ్ వైపే మొగ్గు చూపారు.