పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం తీసుకొస్తున్నాం: మంత్రి సీతక్క
- కేరళలో అమలు చేస్తున్న 'కుటుంబశ్రీ' తరహా పథకం తెస్తున్నామన్న సీతక్క
- సర్వే చేయించి పేదరికంలో ఉన్నవారిని గుర్తిస్తామన్న మంత్రి
- ప్రతి పేద కుటుంబానికి సాయం అందిస్తామని వెల్లడి
కేరళలో ఒక సర్వే నిర్వహించారని... దాని ద్వారా 65 వేల మంది పేదలను గుర్తించి, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని సీతక్క తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా సర్వే చేయించి, పేదరికంలో ఉన్న వారిని గుర్తిస్తామని చెప్పారు.
సర్వే పూర్తయిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి తగిన సాయం అందిస్తామని సీతక్క తెలిపారు. ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడినా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ కొత్త పథకం ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.