ఇరాన్ నుంచి వెంటనే బయటపడండి.. అమెరికన్లకు ట్రంప్ సర్కారు అడ్వైజరీ
- ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడొద్దని హెచ్చరిక
- విమాన సర్వీసుల రద్దు.. భూమార్గంలోనే సరిహద్దులు దాటాలని సూచన
- ఒమన్ లో ఇరు దేశాల మధ్య చర్చలకు ముందు అమెరికా అడ్వైజరీ
ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒమన్ వేదికగా ఈ రోజు ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ లోని తమ పౌరులను ఉద్దేశించి అమెరికా కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ ఉండకుండా వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని హెచ్చరించింది. విమాన సర్వీసుల్లో అంతరాయం నేపథ్యంలో భూమార్గంలోనే దేశం దాటాలని సూచించింది.
ఇరాన్ లో పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఇంటర్నెట్ సేవలపై బ్యాన్, రోడ్లు మూసేయడం, మొబైల్ వాడకంపై ఆంక్షలతో పాటు ఇరాన్ కు విమానాల రాకపోకలు కూడా రద్దయినట్లు వెల్లడించింది. కమ్యూనికేషన్ మార్గాలు కూడా కట్ అయ్యాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని హెచ్చరించింది. వీలైతే భూమార్గంలో ఇరాన్ పొరుగు దేశాలు ఆర్మేనియా, తుర్కియేలకు చేరుకోవాలని తమ పౌరులకు సూచించింది.
ఒమన్ లో నేడు చర్చలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో కొనసాగుతున్న నిరసనలకు అమెరికా మద్దతు తెలుపుతోంది. ఖమేనీ పాలనకు ముగింపు పలకాలన్న ఇరాన్ ప్రజల డిమాండ్ సహేతుకమైనదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఆందోళనకారులకు అమెరికా అండగా ఉంటుందని ఇటీవల ప్రకటించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై ఖమేనీ సర్కారు అమానుషంగా ప్రవర్తిస్తోందని, కాల్పులు జరుపుతూ ప్రజలను బలితీసుకుంటోందని ట్రంప్ ఆరోపించారు.
ఈ చర్యలను వెంటనే నిలిపివేయకపోతే అమెరికా దాడులకు దిగుతుందని హెచ్చరించారు. ఇందుకు తగ్గట్లే అమెరికా బలగాలను, యుద్ధ విమానాలను గల్ఫ్ కు తరలించారు. అదే సమయంలో అణు కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ ను ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోవడంతో ఇరాన్ పై దాడి చేసే విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ తో చర్చలకు అంగీకరించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.