Vijay Deverakonda: ఒకవైపు పెళ్లి వార్తలు.. మరోవైపు బన్నీ సినిమా షూటింగ్‌లో రష్మిక!

Vijay Deverakonda and Rashmika Mandanna Wedding on February 26 Report
  • అల్లు అర్జున్ - అట్లీ సినిమా షూటింగ్‌లో చేరిన రష్మిక మందన్న
  • ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం
  • విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న పెళ్లి అంటూ మళ్లీ ఊహాగానాలు
  • పెళ్లి తేదీపై ప్రశ్నకు స్పందించకుండా చిరునవ్వుతో దాటవేసిన రష్మిక
నటి రష్మిక మందన్న తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒకవైపు నటుడు విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరగనుందనే ప్రచారం జోరుగా సాగుతుండగా, మరోవైపు ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో అడుగుపెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో రష్మిక జాయిన్ అయ్యారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ వారంలోనే రష్మిక సెట్స్‌లోకి అడుగుపెట్టి తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి మధ్య వరకు ఈ షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రంలో రష్మిక తన కెరీర్‌లోనే తొలిసారిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్నారు.

ఇక వృత్తిపరంగా బిజీగా ఉంటూనే, రష్మిక పెళ్లి వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2న వీరి వివాహం అంటూ వచ్చిన వార్తలను రష్మిక ప్రతినిధులు ఖండించినా, ఇప్పుడు కొత్తగా ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో దీనిపై మీడియా ప్రశ్నించగా, "దేనికి రా?" అంటూ చిరునవ్వుతో బదులిచ్చి రష్మిక దాటవేయడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. ఫిబ్రవరి మధ్యలో షూటింగ్ నుంచి ఆమె విరామం తీసుకోనుండటం కూడా ఈ పెళ్లి కోసమేనని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ అధికారికంగా స్పందించలేదు.ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. పెళ్లి తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో త్వరలోనే ఏదో ఒక అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika wedding
Ranabali movie
Geetha Govindam
Dear Comrade
Udaipur palace
Tollywood wedding
Telugu cinema news
Celebrity wedding

More Telugu News