తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలి: కిషన్ రెడ్డి
- ఏపీలో ఎన్నో విమానాశ్రయాలు ఉన్నా తెలంగాణలో ఎందుకు లేవని ప్రశ్న
- కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని విమర్శ
- దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచే వెళుతున్నాయని ఆగ్రహం
తెలంగాణను రక్షించుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని, ఏపీలో విమానాశ్రయాలు ఉన్నాయి కానీ తెలంగాణలో ఎందుకు లేవని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, తెలంగాణ నుంచే డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు. తెలంగాణను కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే.