Ghaziabad suicide case: ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు

Ghaziabad Sisters Suicide Case Shocking Details Emerge
  • సోషల్ మీడియా ఖాతాలను కొరియన్ పేర్లతో తెరిచిన అక్కాచెల్లెళ్లు
  • ఇంట్లో కూడా అవేపేర్లతో పిలుచుకునే వారని గుర్తించిన పోలీసులు
  • సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసి, ఫోన్‌లు తీసుకున్న తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన నిషిక (16), ప్రాచి (14), పఖీ (12) బుధవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి.

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు కొరియన్ అంటే చాలా ఇష్టమని, సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పది రోజుల ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తండ్రి డిలీట్ చేశారు. వీరు ముగ్గురు మరియా, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో ఖాతాలను తెరిచారు. ఇంట్లో కూడా వారు అవే పేర్లతో పిలుచుకునేవారు. ఇటీవల తండ్రి ఆ ఖాతాలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వారి వద్ద నుంచి తండ్రి మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని పోలీసులు తెలిపారు. తమకు కొరియన్ అంటే ప్రాణమని, ఈ విషయం మీకు అర్థం కాదని, ఇక్కడి వాళ్లను మేం పెళ్లి చేసుకోలేమని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

More Telugu News

Ghaziabad suicide case
Uttar Pradesh
Korean online game
Nishika
Prachi
Pakhi
Sister suicide