తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో మార్పులు

తెలంగాణలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో రేపటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో విధంగా ఫీజు వసూలు చేసేవారు. రేపటి నుంచి ఫిక్స్డ్ ఛార్జీలు ఉండనున్నాయి.

గృహ విద్యుత్ కనెక్షన్లకు 1 కిలో వాట్ వరకు రూ.500 వరకు వసూలు చేస్తారు. 1 కిలో వాట్ నుంచి 5 కేవీ వరకు రూ.500 వసూలు చేస్తారు. ఆపై ప్రతి అదనపు కిలో వాట్‌కు రూ.600 చొప్పున వసూలు చేస్తారు. 5 కిలో వాట్ల నుంచి 20 కిలో వాట్ల వరకు రూ.2,900 వసూలు చేస్తారు. అక్కడ్నించి ప్రతి అదనపు కిలో వాట్‌కు రూ.1,500 చొప్పున వసూలు చేస్తారు. 20 కిలో వాట్లు ఆ పైన.. రూ.10,000 వసూలు చేయనున్నారు. వాణిజ్య కనెక్షన్లు అయితే 1 కిలో వాట్ వరకు రూ.1,000 వసూలు చేస్తారు.


More Telugu News