పవన్ కల్యాణ్ పై టీపీసీసీ చీఫ్ విమర్శలు.. తీవ్రంగా స్పందించిన తెలంగాణ జనసేన

  • పవన్ ఏపీలో రాజకీయాలు చేసుకోవాలన్న మహేశ్ గౌడ్
  • జనసేన కేవలం ఏపీ కోసం పెట్టిన పార్టీ కాదన్న తెలంగాణ జనసేన
  • ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేస్తారనే ప్రకటన వెలువడిన నేపథ్యంలో మహేశ్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో రాజకీయం చేసుకోవాలని... తెలంగాణలో కాదని ఆయన అన్నారు. తెలంగాణ గురించి, ఇక్కడి భాష, సంస్కృతి గురించి దారుణంగా మాట్లాడారని... అందుకే ఆయనను తాము దిష్టి కల్యాణ్ అంటామని చెప్పారు. 

ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన స్పందిస్తూ... కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు తెలంగాణ రాష్ట్ర పార్టీలు కాదని... అవి జాతీయ పార్టీలని తెలిపింది. జనసేన అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని... జాతీయ సమగ్రత కోసం తెలంగాణలో పెట్టిన పార్టీ అని పేర్కొంది. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. 


More Telugu News

Pawan Kalyan TPCC Mahesh Kumar Goud Telangana Janasena AP Deputy CM Telangana Politics Janasena Party Municipal Elections BJP National Party Regional Differences