Advocate Swapna: కుటుంబ కలహాలు.. రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయవాది దారుణ హత్య

Advocate Swapna Brutally Murdered in Rangareddy District Due to Family Feud
షార్ట్స్‌లో చూడండి
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. సోదరుడే ఆమె మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మొయినాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో ఆస్తి గొడవలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం పొలం వద్ద పంచాయితీ జరుగుతుండగా సోదరుడు స్వప్నను హతమార్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

న్యాయవాదుల ధర్నా

లాయర్ స్వప్న హత్యను నిరసిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
Go Back to Shorts
Advocate Swapna
Swapna
Rangareddy district
Telangana lawyer murder
Moinabad
Family disputes

More Telugu News