India US trade deal: మన ప్రభుత్వ నిర్ణయాలను ముందు అమెరికా చెబుతోంది.. మోదీపై కాంగ్రెస్ ఫైర్

Congress Fires at Modi Government Over US Trade Deal Announcement
  • మొన్న పాక్ తో కాల్పుల విరమణ.. నేడు ట్రేడ్ డీల్
  • ముఖ్యమైన నిర్ణయాలు అమెరికా వెల్లడిస్తేనే తెలుస్తున్నాయని ఎద్దేవా
  • డీల్ కోసం మోదీ విజ్ఞప్తి చేశాడంటూ ట్రంప్ పేర్కొనడంపైనా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం
మన దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు మనకంటే ముందు అమెరికాకే తెలుస్తున్నాయని, ఆ దేశం వెల్లడించాకే భారతీయులకు తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాజాగా సోమవారం అమెరికాతో కుదిరిన ట్రేడ్ డీల్ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కారుపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయాలను వేరే దేశం వెల్లడించేదాకా భారత ప్రజలకు తెలియడంలేదని ఆరోపించింది.

ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం విషయాన్ని ప్రస్తావిస్తూ.. కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందనే విషయం కానీ, అమలులోకి వచ్చిందనే విషయం కానీ ముందుగా అమెరికానే బయటపెట్టిందని కాంగ్రెస్ పేర్కొంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించే వరకూ భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని గుర్తుచేసింది. ఆ తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారని చెప్పింది.

అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ తనకు విజ్ఞప్తి చేశారని, మోదీ విజ్ఞప్తి మేరకే డీల్ కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించారని తెలిపింది. ఇప్పుడు కూడా ఇంత కీలకమైన విషయాన్ని ట్రంప్ చెప్పే వరకూ భారత ప్రధాని బయటకు వెల్లడించలేదని ఆరోపించింది. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత మోదీ స్పందిస్తూ.. భారత ప్రజల తరఫున అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారని కాంగ్రెస్ పేర్కొంది. 

ట్రంప్ ట్వీట్ ను బట్టి చూస్తే.. కేంద్ర ప్రభుత్వం మన మార్కెట్ తలుపులు బార్లా తెరచి మరీ అమెరికాను ఆహ్వానిస్తోందని స్పష్టమవుతోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అమెరికా ఉత్పత్తులకు భారత్ విధిస్తున్న పన్ను ‘జీరో’ చేయడానికి మోదీ సర్కారు అంగీకరించిందని ట్రంప్ తన ట్వీట్ లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మన దేశంలోని పరిశ్రమలు, వర్తకులు, రైతులకు ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ఎక్స్ హ్యాండిల్ లో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టింది.

More Telugu News

India US trade deal
Congress Party
Donald Trump
Narendra Modi
India Pakistan ceasefire
US foreign policy
Indian economy
Trade agreements
Import tariffs
Indian industries