Komatireddy Venkat Reddy: 'పాంచాలి పంచభర్తృక' సినిమా టీజర్‌ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy Launches Panchali Panchabhartruka Movie Teaser
  • రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో  ‘పాంచాలి పంచభర్తృక’ 
  • టీజర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిః
  • ఆరోగ్యకరమైన హాస్యంతో సినిమా తీశారని ప్రశంస
  • సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “పాంచాలి పంచభర్తృక” సినిమా టీజర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, హాస్యం ఒక మంచి ఔషధం లాంటిదని, అపహాస్యం కాకుండా ఆరోగ్యకరమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయడాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సినీ పరిశ్రమ అభివృద్ధికి, సినిమా కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. చిత్ర నిర్మాణ బృందానికి మంత్రి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రానికి గంగ సప్తశిఖర రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట దుగ్గిరెడ్డి (యూఎస్ఏ) నిర్మాతగా, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మన్యం సహ నిర్మాతలుగా... రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌తో పాటు రోల్ రైడా, జెమినీ సురేష్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సరీహ్ ఫర్, రూపలక్ష్మి, రాజ్ పవన్, రవి రెడ్డి, జబర్దస్త్ నవీన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ కేఎస్‌ఆర్ కథ అందించగా, రాజ్ పవన్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. మహేశ్ నారాయణ, బిషేక్ సంగీతం అందిస్తుండగా, కెవి ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జానీ బాషా ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
Komatireddy Venkat Reddy
Panchali Panchabhartruka
Rajendra Prasad
Telangana cinema
Telugu movie
Movie teaser launch
Ganga Sapthasikara
Telugu cinema industry
Revanth Reddy
Comedy film

More Telugu News