KTR: కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

KTR Responds to Kavithas Comments
షార్ట్స్‌లో చూడండి
కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు రాచరికపు పోకడలకు, నియంతృత్వానికి నిదర్శనంగా ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మున్నిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరు నిలబడ్డా... కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ అంటున్నారని... మున్సిపల్ ఎన్నికల్లో గుణం చూసి ఓటు వేయాలని చెప్పారు. పని చేసే వాళ్లకు, మంచి అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని అన్నారు. చెడ్డ వాళ్లకు ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా? అని ప్రశ్నించారు. జాగృతి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తారని తెలిపారు. 

కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ... కవితపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు. ఆమె గురించి తాను ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజకీయాల్లో రోజూ ఎంతో మంది మాట్లాడుతుంటారని... ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 
Go Back to Shorts
KTR
Kavitha
BRS Party
Telangana Jagruthi
Municipal Elections
Telangana Politics
Forward Bloc
Political Comments
Telangana
MLC Kavitha

More Telugu News