Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా 33 మందిపై కేసు నమోదు

Errabelli Dayakar Rao and 33 Others Booked in Phone Tapping Case Protest
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.  ఇందులో భాగంగా నిన్న ఖమ్మం - వరంగల్‌ జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఈ ఘటనపై మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరో 33 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ వైపు మున్సిపల్‌ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టినందున ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో, మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 
Go Back to Shorts
Errabelli Dayakar Rao
BRS
Telangana
Phone Tapping Case
KCR
Revanth Reddy
Protests
Mahabubabad
Municipal Elections
Telangana Politics

More Telugu News