KCR: నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లి బయల్దేరిన కేసీఆర్

KCR Departs for Erravalli from Nandi Nagar Residence
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన ఎర్రవల్లి ఫాంహౌస్ కు బయల్దేరి వెళ్లారు. 

సిట్ విచారణ సందర్భంగా నంది నగర్ లోని కేసీఆర్ నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. విచారణ ముగిసిన అనంతరం, కేసీఆర్ తన నివాసం బాల్కనీలో నిలబడి పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. మున్సిపల్ ఎన్నికల గురించి వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందని, అయితే, అసమ్మతి లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని, అందరినీ కలుపుకునిపోవాలని సూచించారు. 

సిట్ అధికారులు ఇవాళ కేసీఆర్ ను దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
KCR
KCR phone tapping case
BRS party
Telangana politics
SIT investigation
Errvalli farmhouse
Nandi Nagar
Municipal elections

More Telugu News