KCR: సిట్ విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగం!

KCR Expresses Anguish During SIT Inquiry Break
షార్ట్స్‌లో చూడండి
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ విచారణ షురూ అయింది. విచారణకు ముందు మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.

తెలంగాణ సాధనకు వ్యూహరచన చేసిన గదిలోనే ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం తనను తీవ్రంగా బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కీలక చర్చలు జరిపాను. అలాంటి చోట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు" అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.

విచారణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నందినగర్ పరిసరాల్లో భారీ బందోబస్తు మోహరించారు. విచారణ ప్రారంభం కాగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర నేతలను బయటకు పంపించారు. నిబంధనల ప్రకారం కేసీఆర్ తరఫున న్యాయవాదులను లోపలికి అనుమతించేందుకు సిట్ అధికారులు నిరాకరించారు.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి ఉదయం నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్, మధ్యాహ్నం నుంచి విచారణలో పాల్గొన్నారు. ఈ కేసు విచారణ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
KCR
KCR SIT Inquiry
Telangana phone tapping case
BRS Party
Telangana State Formation
Harish Rao
Nandinagar
Telangana Politics
SIT investigation

More Telugu News