బడ్జెట్ తర్వాత విద్యార్థులతో మంత్రి నిర్మల భేటీ.. కారణం ఇదే..!
- దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 30 మంది ఎంపిక
- లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా బడ్జెట్ ప్రసంగం విన్న విద్యార్థులు
- బడ్జెట్ తయారీ విధివిధానాలపై వారితో ముచ్చటించనున్న మంత్రి
బడ్జెట్ ప్రసంగం తర్వాత విద్యార్థులకు కర్తవ్య భవన్ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను సందర్శించే అవకాశం కల్పించినట్లు వివరించాయి. ఆర్థిక శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, అత్యున్నత స్థాయిల్లో ఆర్థిక నిర్ణయాలు ఎలా రూపొందిస్తారు, అమలు చేస్తారు అనే విషయాలను ఆ విద్యార్థులు తెలుసుకోనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులతో సమావేశమై.. బడ్జెట్ పై వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకుంటారని సమాచారం.