బడ్జెట్ వేళ 'నేత' రాజసం .. నిర్మలమ్మ తొమ్మిదేళ్ల ప్రయాణం!
- తమిళనాడు చేనేత వైభవానికి నిదర్శనంగా 'కట్టం' కాంజీవరం
- వరుసగా 9వ సారి చేనేత చీరలకే మొగ్గు చూపిన మంత్రి
- గతంలో మంగళగిరి, పోచంపల్లి చీరలతో తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు
- వస్త్ర కళాకారులకు 'వోకల్ ఫర్ లోకల్' భరోసా
తొమ్మిదేళ్లుగా ఆమె ధరించిన చీరలు వివిధ రాష్ట్రాల వస్త్ర కళలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా నిలిచాయి.
2025 (మధుబని): బీహార్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి బహూకరించిన చేపల డిజైన్ ఉన్న మధుబని ఆర్ట్ చీరను ధరించారు.
2024 (బెంగాలీ కాంతా): మధ్యంతర బడ్జెట్ వేళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీలం రంగు టస్సర్ సిల్క్ 'కాంతా' వర్క్ చీరలో మెరిశారు.
2023 (కసూతి): కర్ణాటకకు చెందిన ధార్వాడ్ కసూతి ఎంబ్రాయిడరీ మరియు ఇల్కల్ వీవ్ ఉన్న ఎరుపు రంగు చీరను ధరించారు.
2022 (బొంకై): ఒడిశాకు చెందిన ప్రసిద్ధ 'బొంకై' హ్యాండ్లూమ్ చీరను ఎంచుకున్నారు.
2021 (పోచంపల్లి): తెలంగాణకు చెందిన ఎరుపు మరియు క్రీమ్ రంగుల పోచంపల్లి ఇకత్ చీరను ధరించి మన తెలుగు నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు.
2019 (మంగళగిరి): తన తొలి బడ్జెట్ ప్రసంగం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ మంగళగిరి పట్టు చీరను ధరించి సెంటిమెంట్‌ను చాటుకున్నారు.
కేవలం చీరలే కాదు, బడ్జెట్ పత్రాలను మోసుకెళ్లే విధానంలోనూ ఆమె మార్పు తెచ్చారు. గతంలో ఉన్న బ్రీఫ్‌కేస్ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, ఎరుపు రంగు పట్టు వస్త్రంలో చుట్టిన 'బహీ ఖాతా' పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆమె 'డిజిటల్ బడ్జెట్'ను ప్రవేశపెడుతున్నప్పటికీ, ఆ ట్యాబ్‌ను కూడా అదే సంప్రదాయ ఎరుపు రంగు బ్యాగ్‌లో తీసుకెళ్లడం విశేషం.