బడ్జెట్ 2026: కాంజీవరం చీరలో నిర్మలమ్మ
కాంజీవరం, టస్సర్, లేదా ఇతర ప్రాంతీయ చేనేత కళలను ప్రదర్శిస్తూ, భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా ఉండే చీరలనే బడ్జెట్ వేళ ధరించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంచుకుంటారు. కాగా, ఈ ఏడాది కాంజీవరం పర్పుల్ కాటన్ సిల్క్ చీర ధరించిన మంత్రి నిర్మలా సీతారామన్.. 2024లో బీహార్ సాంప్రదాయాన్ని తెలిపే మధుబని ప్రింట్‌తో కూడిన ఆఫ్-వైట్ హ్యాండ్లూమ్ చీర ధరించారు.
అదే ఏడాది మధ్యంతర బడ్జెట్ కు నీలి రంగు టస్సర్ సిల్క్ చీరపై కాంత వర్క్ చేసిన చీరను.. 2023లో ఎరుపు-నలుపు రంగుల కాసుతి ఎంబ్రాయిడరీ చీరను నిర్మలమ్మ ధరించారు.