Kavitha: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కవిత
- ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి తీవ్రంగా కలచివేసిందన్న కల్వకుంట్ల కవిత
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కవిత
- సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందన్నారు.
సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.